వరంగల్: సామాజిక సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్స్ ఎల్లప్పుడూ ముందుంటాయని హైదరాబాద్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దోసపాటి వెంకటేశ్వరరావు అన్నారు. వరంగల్ రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రంలో జిల్లా -101 రీజియన్-3 ఆధ్వర్యంలో రీజియన్ చైర్మన్ డా. సోమ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన రీజియన్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వాసవి క్లబ్స్ అనేక కార్యక్రమాలు చేపట్టాయన్నారు. గౌరవ అతిథిగా హాజరైన ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమాజహిత కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు జరిగాయన్నారు. రీజియన్ చైర్మన్ డాక్టర్ సోమ శ్రీధర్ జ్యోతి దంపతులు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. బిజీ షెడ్యూల్లోనూ వైద్యులు సామాజిక సేవకు సమయం కేటాయించడం అభినందనీయమన్నారు. కాళేశ్వరంలోని ఆర్యవైశ్య సత్రంకు 12 గ్రీజర్లను అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగశాయిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కళాశాలకు కంప్యూటర్, పోటీ పరీక్షల పుస్తకాలు అందజేశారు. పేద మెడిసిన్ విద్యార్థికి రూ.15వేలు, బీసీఏ విద్యార్థి ఫీజు రూ.7,500 ఆర్థిక సహాయం అందించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సీడ్ బాల్స్ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి శివగంగా సేవ పురస్కారాలను అందించారు. కృత్రిమ మేధ, సైబర్ నేరాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయ సహాయ రిజిస్ట్రార్ డాక్టర్ పృథ్వీరాజు వల్లాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరంలోని ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు సోమ రామయ్య, క్లబ్ గవర్నర్ విజయ, క్లబ్స్ అంతర్జాతీయ అధికారులు శ్రీనివాస్, రవ్వ గీత, దాచేపల్లి సీతారాం, వీరన్న, హరిత, రాజేశ్వర్, డాక్టర్లు సృజన్, సుధీర్ కుమార్, అశోక్, దిలీప్ కుమార్, 80 మందికి పైగా వైద్యులు, సుమారు 400 మంది వాసవి క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్స్ ముందంజ
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- వరంగల్ రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రంలో జిల్లా -101 రీజియన్-3 ఆధ్వర్యంలో రీజియన్ చైర్మన్ డా.
- కాళేశ్వరంలోని ఆర్యవైశ్య సత్రంకు 12 గ్రీజర్లను అందించినట్లు పేర్కొన్నారు.
- వరంగల్: సామాజిక సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్స్ ఎల్లప్పుడూ ముందుంటాయని హైదరాబాద్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దోసపాటి వెంకటేశ్వరరావు అన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Akula Dhanlaxmi
Reporter
Telangana
13ఆర్టికల్స్
4,640వ్యూస్