స్టాంప్స్, రిజిస్ట్రేషన్ గ్రూప్-1 అధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జిల్లా రిజిస్ట్రార్లుగా పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు అధికారులకు కొత్త నియామకాలు జరిగాయి.
గ్రూప్-1 అధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్లుగా నియమించారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆరుగురికి పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ గా షగుఫ్తా ఫిర్దోస్, నల్గొండ జిల్లా రిజిస్ట్రార్ గా మోనికా రాణి, సయ్యద్ యూసఫ్ అలీ (ఎంవీ అండ్ ఏ), హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ గా మాధవ్, మహబూబ్ నగర్ జిల్లా రిజిస్ట్రార్ గా దీపక్, మెదక్ జిల్లా రిజిస్ట్రార్ గా సందీప్ కుమార్ నియమితులయ్యారు.
ఖమ్మం జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సంపత్ కుమార్ ను ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రవీందర్ రావును మెదక్ జిల్లా రిజిస్ట్రార్ (ఎంవీ అండ్ ఏ)గా బదిలీ చేశారు.




